పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్ వేడుకలు... ఇలా శుభకార్యం ఏదైనా కేక్ ఉండాల్సిందే. కేక్ కటింగ్ చేస్తేనే స్పెషల్ డేగా ఫీల్ అవుతాం. మరి కేక్‌కు ఇంతలా డిమాండ్ పెరుగుతండటంతో తయారీదారులు(బేకర్స్) కూడా విభిన్న రూపాల్లో డిజైన్ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా కొత్త కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు. ఇటీవలే హాస్పిటల్ బెడ్‌పై నవ్వుతున్న ఓ పేషెంట్లా తయారు చేసిన కేకు ఒకటి ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వినూత్న కేక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది సాధారణమైన కేక్ కాదండోయ్.. అమెజాన్ పార్సిల్ రూపంలో ఉన్న కేక్.
అవును మీరు విన్నది నిజమే. అచ్చం అమెజాన్ నుంచి వచ్చే ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ను డిజైన్ చేశారు. అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్ చేసింది. యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్ తయారు చేశారు. ఇక దీనిని ట్వీటర్లో పోస్టు చేయడంతో అమెజాన్ పార్సిల్ కేక్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారు. కానీ అది కేక్ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు. ఈ తర్వాత కేక్ అని క్లారిటీ రావడంతో సర్ప్రైజ్ అవుతున్నారు. అంతేగాక అనేకమంది నెటిజన్లు ఈ కేక్‌పై మీమ్స్ సృష్టిస్తున్నారు. మరి ఇతంలా వైరలవుతున్న దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి
Yn dilyn my mhost ddoe, teisan bocs Amazon, dyma'r prawf i ddangos mai teisen ydyw. 😊
Following my post yesterday, Amazon box cake, here's the proof that it is actually cake! 😊#Anglesey #Amazon #cake #cakes pic.twitter.com/RZ5HbcQ7T1
— Nina's Cake Cabin (@angleseycakeart) February 3, 2021
Omds not this shit again wtf pic.twitter.com/b1fsQihngf
— ً (@rxmchls) February 18, 2021
Omds not this shit again wtf pic.twitter.com/b1fsQihngf
— ً (@rxmchls) February 18, 2021
Imagine seeing this outside your door and picking it up to put under your arm pic.twitter.com/ghiaiGMqn7
— KSB 👨🏾🚒 (@kfRedhot) February 19, 2021