నాలుగో పెళ్లి కోసం మూడో భర్తను చంపేసి..

11 Sep, 2023 08:42 IST|Sakshi

బీహార్‌లోని పట్నాలో గల ఫుల్వారీ షరీఫ్‌లో యూపీకి చెందిన యువకుని మృతి కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ‍ప్రకారం అత్తామామలు, భార్య కలిసి ఆ యువకుని గొంతు నొక్కి హత్యచేశారు. మృతుని భార్య అస్మెరీ ఖాతూన్‌ ఉరఫ్‌ మంజూ దేవికి గతంలోనే రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయి. మృతుడు సుభాష్‌ ప్రజాపతి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం తన వదిన ప్రస్తుతం మరొకరితో సంబంధం కలిగివుందని, అతనిని నాలుగో వివాహం చేసుకోవాలని భావిస్తున్నదని తెలిపారు. 

మృతుడు సుభాష్‌కు భార్య తీరు నచ్చకపోవడంతో ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె సుభాష్‌ను హత్య చేసిందని మృతుని బంధువులు తెలిపారు. సుభాష్‌ రెండేళ్ల క్రితం అస్మెరీ ఖాతూన్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ‍ప్రకారం మృతుడు మద్యానికి బానిస. భార్యతో తరచూ ఏదోఒక విషయమై గొడవ పడుతుండేవాడు. ఈ కారణంగానే హత్య జరిగింది. అస్మెరీకి గతంలోనే రెండు వివాహాలు జరిగాయి. ఆమె వారిని వదిలివేశాక మూడవసారి సుభాష్‌ను వివాహం చేసుకుంది. అస్మెరీకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సుభాష్‌ సోదరుడు బ్రజేష్‌ మాట్లాడుతూ తన సోదరుని భార్య అస్మెరీ ఖాతూన్‌ ప్రస్తుతం మరో యువకునితో సంబంధం ఏర్పరుచుకున్నదని, ఈ సంగతి తెలిసిన తన సోదరుడు ఆమెను నిలదీశాడని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో అస్మెరీ తన తల్లిదండ్రులతో కలసి సుభాష్‌ను గొంతునొక్కి చంపేశారని ఆరోపించాడు. ఈ ఉదంతం గురించి ఫుల్వారీ పోలీసు ఉన్నతాధికారి సఫిర్‌ ఆలం మాట్లాడుతూ సుభాష్‌ హత్య గురించి తమకు సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
ఇది కూడా చదవండి: ఆ ఒక్క జవాను.. పాక్‌ ఆశలను పటాపంచలు చేశాడు!

మరిన్ని వార్తలు