బత్తిలి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

18 Nov, 2023 00:36 IST|Sakshi
గుర్తు తెలియని మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై అమ్మాన్‌రావు, రెవెన్యూ సిబ్బంది

భామిని: మండలంలోని బత్తిలి పాత సినిమా హాల్‌ సమీపంలో పంటపొలాల గట్టుపై గుర్తు తెలియని మృతదేహాన్ని ఎస్సై యతిరాజుల అమ్మాన్‌ రావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుండి 45 ఏళ్లు ఉండవచ్చని దివ్యాంగుడి మృతదేహంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి శరీరంపై నల్లని నిక్కరు ఉందని, శరీరం కుళ్లికృశించి పోయి ఎముకలు బయకు కనిపిస్తున్నాయని చెప్పారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుని వివరాలపై లుకౌట్‌ నోటీసులు విడుదల చేసి వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై అమ్మానరావు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్‌ నంబర్లు 6309990884,9490595599కు తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు