నందన్‌కానన్‌ జూలో రోప్‌ వే | Sakshi
Sakshi News home page

నందన్‌కానన్‌ జూలో రోప్‌ వే

Published Sat, Nov 18 2023 12:36 AM

ప్రారంభించిన రోప్‌ వే   - Sakshi

భువనేశ్వర్‌: బారంగ్‌ నందన్‌కానన్‌ జులాజికల్‌ పా ర్కు సందర్శకులు ప్రకృతి రమణీయ అందాలను ఆస్వాదించవచ్చు. దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న రోప్‌వే విహార సౌకర్యాన్ని రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ప్రదీప్‌కుమార్‌ అమత్‌ శుక్రవారం ప్రారంభించారు. మంత్రితో పాటు జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే సురేష్‌ కుమార్‌ రౌత్రాయ్‌ మరియు ఇతర సీనియర్‌ అధికారులు ప్రారంభోత్సవం జరిగిన వెంటనే తొలి విహారం చేశారు. రోప్‌వే విహార సౌకర్యం సందర్శకులకు శనివారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఒకరికి రూ.120 చొప్పున రుసుము సందర్శకులు చెల్లించాల్సి ఉంటుంది. ఫొటోగ్రఫీ కోసం కెమెరా తీసుకోవడానికి అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికోసం ప్రత్యేక టిక్కెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. వారపు సెలవు మినహా ప్రతిరోజూ ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వర కు రోప్‌వే విహారం అందుబాటులో ఉంటుంది. సుందరమైన కంజియా సరస్సు మీదుగా 626 మీటర్ల దూరం ఈ విహారం కొనసాగుతుంది. నందన్‌ కానన్‌ జూ ప్రాంగణం నుంచి ప్రారంభమై బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఒక విడతలో 72 మంది సందర్శకులు రోప్‌ వే సౌకర్యాన్ని పొందగలుగుతారు.

Advertisement
Advertisement