ఉప ఎన్నికల పోలింగ్‌: ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు..

23 Jun, 2022 14:00 IST|Sakshi

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా గురువారం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

► అసెంబ్లీ ఉప ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్‌ శాతం.. 

- ఆత్మకూరు(ఏపీ)-- 24.92 శాతం
- అగర్తలా(త్రిపుర)-- 34.26 శాతం
- టౌన్‌ బార్డోవాలి(త్రిపుర)-- 35.43 శాతం
- సుర్మా(త్రిపుర)-- 33.50 శాతం
- జుబరాజ్‌నగర్‌(త్రిపుర)-- 29.14 శాతం
- మందార్‌(జార్ఖండ్‌)-- 29.13 శాతం
- రాజింద్ర నగర్‌(ఢిల్లీ)-- 14.85 శాతం

► దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం.. 
 అసెంబ్లీ స్థానాలు..
- ఆత్మకూరు(ఏపీ)-- 11.56 శాతం
- అగర్తలా(త్రిపుర)-- 15.29 శాతం
- టౌన్‌ బార్డోవాలి(త్రిపుర)-- 16.25 శాతం
- సుర్మా(త్రిపుర)-- 13 శాతం
- జుబరాజ్‌నగర్‌(త్రిపుర)-- 14 శాతం
- మందార్‌(జార్ఖండ్‌)-- 13.49 శాతం
- రాజింద్ర నగర్‌(ఢిల్లీ)-- 5.20 శాతం

లోక్‌సభ స్థానాలు.. 
- సంగ్రూర్‌(పంజాబ్‌)-- 4.07 శాతం
- రాంపూర్‌(యూపీ)-- 7.86 శాతం
- ఆజాంఘర్‌(యూపీ)-- 9.21 శాతం. 

► ఢిల్లీలోని రాజీంద్రనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆప్‌ రాజ‍్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► త్రిపురలోని బోర్డోవాలీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీఎం మాణిక్‌ సాహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► ఈశాన్య రాష్ట్రం త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. 

► పంజాబ్‌లో సాంగ్రూర్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవల్‌ సింగ్‌ థిల్లాన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

► ఢిల్లీలోని రాజింద్రానగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్‌ భాటీయా, ఆప్‌ నుంచి దుర్గేష్‌ పాథక్‌, కాంగ్రెస్‌ నుంచి ప్రేమ్‌లత బరిలో ఉన్నారు.

 జార‍్ఖండ్‌లోని మందార్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. 

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 

లోక్‌సభ స్థానాలు.. 
- ఉత్తర ప‍్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్‌ఘర్‌, రాంపూర్‌, 
- పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్‌. 

అసెంబ్లీ స్థానాలు.. 
- త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్‌ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్‌, 
- ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్‌, 
- జార్ఖండ్‌లో మందార్‌, 
- ఏపీలో ఆత్మకూర్‌. 

మరిన్ని వార్తలు