ఎక్కడున్నా హుజూరాబాద్‌కు వెళ్లేలా.. 

14 Jul, 2021 01:53 IST|Sakshi

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాగానే సంజయ్‌ పాదయాత్రగా అక్కడికి వెళ్లేలా షెడ్యూల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పాదయత్ర సందర్భంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడినా, ఆ సమయంలో ఎక్కడున్నా అక్కడి నుంచి హుజూరాబాద్‌కు పాదయాత్రగా వెళ్లేలా పార్టీ నాయకత్వం షెడ్యూల్‌ రూపొందిస్తోంది. ఆగస్టు 9న హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

నాలుగైదు లేదా అంతకు మించి విడతల్లో యాత్ర చేపట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నందున పాదయాత్రను రాజకీయంగా వీలైనంత ఎక్కువగా ఉపయోగపడేలా షెడ్యూల్‌ ఇతర కార్యక్రమాలను రూపొందించాలని పేర్కొంటున్నారు. పాదయాత్ర ఏర్పా ట్లపై వేయాల్సిన కమిటీలు తదితర అంశాలపై మంగళవారం ఉదయం సీనియర్‌ నేతలతో, సాయంత్రం రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జులతో బండి సంజయ్‌ అధ్యక్షతన రెండు విడతలుగా సమావేశం జరిగింది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు