బీజేపీ, బీఆర్‌ఎస్‌కు షాక్‌ తప్పదా?.. రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

9 Jul, 2023 18:33 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో రాహుల్‌ గాంధీ మీటింగ్‌ తర్వాత బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, రేణుకా చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసే జిమ్మిక్కులు ప్రజలకు తెలుసు. కర్ణాటక నుంచి కమలాన్ని తరిమేసాం. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు త్వరలోనే షాక్‌ తగలబోతుందంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి.. అది మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌కు భయపడే బీజేపీ.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను మార్చారు. ఇదే సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కిషన్‌రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. వీటన్నింటిలో కేసీఆర్‌ మంతనాలు ఉన్నాయని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్‌ ఫుల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు