త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతా: ధర్మపురి సంజయ్‌

13 Jul, 2021 15:22 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

కాంగ్రెస్‌లో చేరనున్న ఎర్ర శేఖర్‌, గండ్ర సత్యనారాయణ

కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వలసలు

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో పుట్టి పెరిగా.. మా నాన్న కోసమే మధ్యలో టీఆర్‌ఎస్‌లో చేరాను అన్నారు డి.శ్రీనివాస్ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్. రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడం కోసం తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో మహబూబ్‌నగర్ బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్. ధర్మపురి సంజయ్‌లు మంగళవారం భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించాను. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతా.. పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేను మా నాన్న కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాను. గులాబీ కండువా ఒక గొడ్డలి లాంటిది. టీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీ కాదు.. జిల్లా ప్రెసిడెంట్‌కు గుర్తింపు లేదు’’ అన్నారు. 

కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖర్‌, గండ్ర సత్య నారాయణ
బీజేపీ మహబూబ్ నగర్ అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ పార్టీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు. మంచిరోజు చూసుకొని నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేస్తానని ఎర్రశేఖర్ తెలిపారు. ఎర్రశేఖర్‌తో పాటు మాజీ టీడీపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు