ఆ విషయంపై క్లారిటీ కావాలి: హరీష్‌రావు

9 Dec, 2023 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ పెట్టుబడిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని.. క్లారిటీ కావాలంటూ కొత్త  ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు.

‘‘ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదు. మేం అధికారంలో ఉన్నపుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎప్పటి లోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. యాసంగి పంట వేసే సమయం వచ్చింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. డిసెంబర్ 9న వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు’’ అని హరీష్‌రావు విమర్శించారు.
ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం

>
మరిన్ని వార్తలు