ఒక ప్రభుత్వం కాదు ఇది మూడు గ్రూపుల సర్కారు

28 May, 2021 09:43 IST|Sakshi

కర్ణాటక మంత్రి యోగీశ్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

సీఎం యడియూరప్పపై వ్యతిరేక స్వరం

శివాజీనగర: పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్‌ సొంత ప్రభుత్వం మీదనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది శుద్ధమైన బీజేపీ ప్రభుత్వంగా లేదు, మూడు గ్రూపుల సర్కారు మాదిరి ఉంది. మా ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్‌లతో కుమ్మక్కయ్యింది అని విమర్శించారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళుతుంటా, వస్తుంటా, అవన్నీ మీడియా ముందు చెప్పలేను. నా ఢిల్లీ పర్యటనపై ఈ ప్రచారం ఎందుకు జరిగిందనేది అర్థం కావటం లేదన్నారు.  ముఖ్యమంత్రి మార్పు తన ఉద్దేశం కాదు, సొంత పనిమీదే వెళ్లాను అన్నారు.

చదవండి: సీఎం మార్పు కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన
చదవండి: చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు

మరిన్ని వార్తలు