ఓడి ఇంట్లో కూర్చొని ఇదేం వాదన బాబూ!

29 Oct, 2020 03:57 IST|Sakshi

మంత్రి కన్నబాబు మండిపాటు

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓడిపోయి, 23 సీట్లకే పరిమితమై సొంత రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్‌లో ఇంట్లో కూర్చొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన మనిషి.. గెలిస్తే ఇద్దామనుకోవడమేమిటి? ఓడిన తర్వాత ఈ వాదనేంటి? ఈ లెక్కలేంటి? అని ప్రశ్నించారు. రైతుల పట్ల అంత ప్రేమే ఉంటే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎందుకివ్వలేదు? అని నిలదీశారు. 

► జగన్‌ ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానని చెప్పి, ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500కు పెంచారు. ఈ పథకం పేరే వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌. ఈ స్కీంలో కేంద్రం వాటా ఉంది. చంద్రబాబు  తాను అధికారంలోకి వచ్చి ఉంటే రూ.1,15,000 ఇచ్చే వాడినని, జగన్‌ కేంద్రం వాటాతో కలిపి రూ.67,500 మాత్రమే ఇస్తున్నారని  చెప్పడం విడ్డూరం.  
► బడ్జెట్‌ అంటే ఏమిటో తెలియదా? ఆస్తులు, అప్పులు, పథకాలు ఉండవా? కేంద్రం వాటా ఉండదా?  రైతులు సంతోషంగా ఉంటే బాబు ఓర్వలేక పిచ్చిలెక్కలు చెబుతున్నారు. ఆ వాదనకు బాబు పచ్చ మీడియా డప్పు కొడుతోంది. రైతుల్ని మోసం చేసిందే బాబు. ఆవేళ రుణమాఫీ మొత్తం రూ.87,612 కోట్లకు కోతలు వేసి, రూ.24,000 కోట్లకు కుదించారు. అందులో ఐదేళ్లలో ఇచ్చింది రూ.12,731 కోట్లే్ల. జగన్‌  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతులకు రూ.12 వేల కోట్లు ఇచ్చారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు