రాహుల్‌ గాంధీకి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్‌

6 May, 2022 21:18 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ రాజకీయ డ్రామా అంటూ మంత్రి ఎర్రబెల్లి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌వి మోసపూరిత వాగ్ధానాలంటూ దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు ఛతీస్‌గడ్‌లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 
చదవండి: వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు