కేంద్ర మంత్రికి సర్జరీ.. చర్చలకు బ్రేక్‌

4 Oct, 2020 10:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై చర్చలు తుది దశకు చేరుకున్నాయనుకున్న తరుణంలో మరోసారి బ్రేక్‌ పడింది. లోక్‌ జన శక్తి పార్టీ (ఎల్‌జేపీ) అగ్ర నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌కి అత్యవసరంగా హార్ట్‌ సర్జరీ నిర్వహించడంతో శనివారం నిర్వహించాల్సిన భేటీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రికి ఇవాళ ఉదయం శస్త్రచికిత్స జరిగిందని ఎల్‌జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఆయన ట్వీట్‌ చేశారు. రానున్న రోజుల్లో అవసరమైతే మరో శస్త్ర చికిత్స నిర్వహించే వీలుందని డాక్టర్లు వెల్లడించారని చిరాగ్‌ చెప్పారు. 

కష్టకాలంలో తన కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ కూటమి ఆర్‌జేడీ-కాంగ్రెస్‌ కూటమితో తలపడనుండగా ఎన్‌డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు)

మరిన్ని వార్తలు