నిజాం షుగర్స్‌ మూసివేత వెనక భూ కుంభకోణం

30 Oct, 2022 01:37 IST|Sakshi
ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద రైతులతో కలసి  మహాధర్నాలో పాల్గొన్న షర్మిల 

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

మల్లాపూర్‌(కోరుట్ల): నిజాం షుగర్‌ ఫ్యాక్టరీల మూసివేత వెనుక భారీ భూ కుంభ కోణం దాగి ఉందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన మహాధర్నాలో చెరకు రైతులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఫ్యాక్టరీల 51% వాటాను ప్రైవేటుపరం చేశారన్నారు. ఐదేళ్లలో 100% ప్రైవేటీ కరించి బడా వ్యాపారి గోకరాజు గంగరాజుకు కట్టబెట్టేందుకు కుట్రపన్నారని మండిపడ్డారు.

కానీ, వైఎస్సార్‌ సీఎం అయ్యాక ప్రైవేటీకరణ నిలిపివేసి, ప్రభుత్వ పరం చేసేందుకు మాజీ మంత్రి రత్నాకర్‌రావుతో కమిటీ వేశారని గుర్తుచేశారు. ప్రభుత్వపరం చేస్తానన్న సీఎం కేసీఆర్‌ ఫ్యాక్టరీలను మూసివేయించారని విమర్శించారు. నిజాం ఫ్యాక్టరీల మూసివేత వెనుక కుంభకోణం దాగి ఉందని, మూడు ఫ్యాక్టరీల పరిధిలో రూ.3 వేల కోట్లు విలువచేసే భూములు న్నాయని, అందుకే కేసీఆర్‌ ఫ్యాక్టరీలను నడపకుండా చేతులేత్తేశారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు