వైరల్ : ఈ డస్ట్‌ బిన్‌కు ఏమైందబ్బా!

25 Jul, 2020 10:54 IST|Sakshi

కొన్ని కొన్ని వీడియోలు  చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగడంతో పాటు వాటికి మన జీవితంతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వాటిని చూసిన వెంటనే మనకి కామెంట్‌ చేయాలనో, లైక్‌ కొట్టాలనో అనిపిస్తుంది.  అలాంటి ఒక వీడియోని ఇప్పుడు చూడండి. వర్షంలో ఒక బ్లూ కలర్‌లో ఉన్న డస్ట్‌బిన్‌ చాలా  దూరం తేలుతూ వెళ్లింది. 28 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ‘ఐయామ్‌మేరికిర్క్‌’ అనే ట్విట్టర్‌ యూజర్‌ తన ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మరో వడగళ్లు? ఈ బ్లూ బిన్‌ను చూస్తుంటే నాకు ఏం వద్దు, బై‌, అని వెళుతున్నట్లు  ఉంది. మిగిలిన ఏడాదికి గుడ్‌లక్‌’ అనే శీర్షికను జోడించింది. 

చదవండి: అనుకోని అతిధి రాకతో అద్భుతం..

ఈ వీడియోను ఇప్పటి వరకు 3.2 లక్షల మంది వీక్షించగా, 9,300 లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకు చాలా కామెంట్స్‌ వస్తున్నాయి. ఆ డస్ట్‌ బిన్‌ నాదే అంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. డస్ట్‌ బిన్‌ నీటిలో వెళుతున్న మరో వీడియోను షేర్‌ చేసిన ఒ​క నెటిజన్‌ ‘ఇది ట్రెండ్‌’ అంటూ కామెంట్‌ చేశారు. కొంత మంది ఈ వీడియోను సినిమాలోని  పాత్రలతో పోలుస్తూ వాటిని షేర్‌ చేస్తున్నారు.  

చదవండి: క్వారంటైన్ సెంట‌ర్‌లో డ్యాన్సులేస్తూ చిందులు

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు