Alastair Cook: 15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు

26 May, 2022 21:16 IST|Sakshi
అలిస్టర్‌ కుక్‌(ఫైల్‌ ఫోటో)

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌... ఆల్‌టైమ్‌ టెస్టు గ్రేట్‌స్ట్‌ బ్యాటర్‌ అలిస్టర్‌ కుక్‌ 15 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అదేంటి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. 12 ఏళ్ల కెరీర్‌లో అలిస్టర్‌ కుక్‌ ఇంగ్లండ్‌ తరపున 161 టెస్టులు ఆడాడు. అందులో 291 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 35సార్లు మాత్రమే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కుక్‌ ఎంత మంచి బ్యాటర్‌ అనేది. మరి 12 ఏళ్ల అనుభవం ఉన్న కుక్‌ను 15 ఏళ్ల కుర్రాడు క్లీన్‌బౌల్డ్‌ చేస్తే అది విశేషమే కదా.

ఈ ఘటన 12 ఓవర్‌ గేమ్‌లో భాగంగా యంగ్‌ ఫార్మర్స్‌, పొట్టొన్‌ టౌన్‌ మధ్య మ్యాచ్‌లో చోటు చేసుకుంది. యంగ్‌ ఫార్మర్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అలిస్టర్‌ కుక్‌ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కాగా పొట్టొన్‌టౌన్‌ బౌలర్‌ కైరన్‌ షాకిల్‌టన్‌ లెగ్‌సైడ్‌ దిశగా బంతిని వేశాడు. షాట్‌ ఆడే ప్రయత్నంలో కుక్‌ విఫలమయ్యాడు.. వెంటనే బంతి నేరుగా మిడిల్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో 15 ఏల్ల కైరన్‌ షాకిల్‌టన్‌కు పట్టరాని సంతోషమేసింది. 12 ఏళ్ల అనుభవం ఉన్న ఒక మాజీ క్రికెటర్‌ తన బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అవడం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత కైరన్‌ 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పొట్టొన్‌ 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ ఫార్మర్‌ 7 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమై 26 పరుగులతో పరాజయం పాలైంది.

ఇక ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ టెస్టు క్రికెటర్లలో అలిస్టర్‌ కుక్‌ ఒకడిగా ఉన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆండ్రూ స్ట్రాస్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కుక్‌ విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ తరపున 161 టెస్టుల్లో 12,472 పరుగులు సాధించిన కుక్‌ ఖాతాలో 33 టెస్టు సెంచరీలు ఉన్నాయి. 92 వన్డేల్లో 3204 పరుగులు సాధించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆల్‌టైమ్‌ జాబితాలో కుక్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: 'కోచ్‌గా ఉండుంటే కేఎల్‌ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని'

IND Vs IRE:  టీమిండియా టి20 తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ 

మరిన్ని వార్తలు