-

భారత్‌తో టీ20 సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్‌ ఆటగాళ్లంతా ఇంటికి

28 Nov, 2023 13:13 IST|Sakshi

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్‌ 28) జరుగబోయే మూడో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యులైన మ్యాక్స్‌వెల్‌,  స్టీవ్‌ స్మిత్‌, ఆడమ్‌ జంపా, స్టోయినిస్‌, ఇంగ్లిస్‌, సీన్‌ అబాట్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది.

వీరిలో స్టీవ్‌ స్మిత్‌, ఆడమ్‌ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్‌ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్‌ ఫిలిప్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌ ఇదివరకే భారత్‌కు చేరుకోగా.. బెన్‌ డ్వార్షుయిస్‌, క్రిస్‌ గ్రీన్‌లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. 

ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘన విజయాలు సాధించింది. ఆసీస్‌ జట్టులో స్టార్‌ ఆటగాళ్లు మిస్‌ కానుండటంతో ఈ సిరీస్‌ ఇకపై కల తప్పనుంది. భారత్‌ జట్టులోని స్టార్‌ ఆటగాళ్లు సైతం వరల్డ్‌కప్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. 

భారత్‌తో టీ20 సిరీస్‌కు అప్‌డేట్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు..
మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్‌ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్‌ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్‌ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్‌ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్

మరిన్ని వార్తలు