Babar Azam: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజాం.. తొలి ఆసియా ఆటగాడిగా..!

17 Jul, 2022 15:53 IST|Sakshi

శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన పాక్‌ బ్యాటర్‌గా బాబర్‌ అజామ్‌ రికార్డు సృష్టించాడు. బాబర్‌ 228 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా.. అంతకు ముందు ఈ రికార్డు పాక్‌ దిగ్గజం జావేద్ మియాందాద్(248 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.

మరోవైపు టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డును కూడా బాబర్‌ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా బాబర్‌ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ అరుదైన రికార్డును కోహ్లి 232 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. ఆజాం 228 ఇన్నింగ్స్‌లలోనే సాధించి అధిగమించాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10000 పరుగులు సాధించిన ఆసియా ఆటగాళ్లు
బాబర్ ఆజాం (228 ఇన్నింగ్స్‌లు)
విరాట్ కోహ్లీ (232 ఇన్నింగ్స్‌లు)
సునీల్ గవాస్కర్ (243 ఇన్నింగ్స్‌లు)
జావేద్ మియాందాద్ (248 ఇన్నింగ్స్‌లు)
సౌరవ్ గంగూలీ (253 ఇన్నింగ్స్‌లు)

ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10000 పరుగులు చేసిన ఆటగాళ్లు
వివ్ రిచర్డ్స్ (206 ఇన్నింగ్స్‌లు)
హషీమ్ ఆమ్లా(217 ఇన్నింగ్స్‌లు)
బ్రియాన్ లారా(220 ఇన్నింగ్స్‌లు)
జో రూట్(222 ఇన్నింగ్స్‌లు)
బాబర్ ఆజాం( 228)
చదవండి
IND vs ENG 3rd ODI: టీమిండియా, ఇంగ్లండ్‌ మూడో వన్డే లైవ్‌ అప్‌డేట్స్‌

మరిన్ని వార్తలు