ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ బాస్‌ సోదరుడు

15 Aug, 2021 11:52 IST|Sakshi

కోల్‌కతా: బీసీసీఐ బాస్‌ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)‌ కార్యదర్శి అయిన స్నేహాశీష్.. స్వల్ప అస్వస్థకులోనై(జ్వరం, కడుపునొప్పి) శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు అపోలో ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ జరిగింది. 

దీంతో యాంజియోప్లాస్టీ వల్లే ఏమైనా సమస్య వచ్చిందేమోనని కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. జ్వరంగా కూడా ఉండటంతో కోవిడ్‌ పరీక్ష చేయించారు. అందులో నెగిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో సౌరవ్ గంగూలీకి కూడా యాంజియోప్లాస్టీ జరిగింది. 
 

మరిన్ని వార్తలు