CWG 2022 Medals Tally: పతకాల పట్టికలో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచిందంటే..!

9 Aug, 2022 07:34 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్‌ క్రీడోత్సవం సోమవారంతో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్‌ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి 66 పతకాలు గెలిచి మూడో స్థానంలో నిలిచింది.

అయితే గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో షూటింగ్‌ క్రీడాంశంలో భారత్‌ ఏకంగా 16 పతకాలు సొంతం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లో షూటింగ్‌ క్రీడాంశాన్ని నిర్వహించలేదు. ఫలితంగా భారత్‌ పతకాల ర్యాంక్‌లో ఒక స్థానం పడిపోయింది. ఒకవేళ షూటింగ్‌ కూడా బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో ఉండి ఉంటే భారత్‌ పతకాల సంఖ్యలోనూ, తుది ర్యాంక్‌లోనూ మరింత మెరుగయ్యేది.   

మరిన్ని వార్తలు