ధోనితో వాట్సన్‌ బ్రేక్‌ఫాస్ట్‌..

4 Sep, 2020 15:57 IST|Sakshi

చైన్నై: కరోనా పాజిటివ్‌ కలకలంతో ఐపీఎల్‌లో పాల్గొనే సీఎస్‌కే(చెన్సై సూపర్‌ కింగ్స్‌) టీమ్‌ ఇటీవలే హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లింది. అయితే సీఎస్‌కే క్వారంటైన్‌ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఆటగాళ్లందరు కలిసి టిఫిన్‌ చేశారు. కాగా సీఎస్‌కే టీమ్‌లో 13మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో సీఎస్‌కే స్టాఫ్‌, ఫ్రాంచైజీలు క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే ‌ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌లు ఇద్దరు టేబుల్‌పై కూర్చున్న ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

‌తమిళ భాషలో సీఎస్‌కే టీమ్ వాట్టో థాలా దర్శనమ్‌(టిఫిన్‌ చేయడానికి సిద్ధం) అని పోస్ట్‌ చేసింది. కాగా ఇటీవల సీఎస్‌కేలో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత కారణాలతో సీఎస్‌కే ఆటగాడు రైనా ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. ఈ విషయమై సీఎస్‌కే యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌కు రైనాకు కొంత వివాదం నెలకొందని ఆరోపణలు వచ్చాయి. అయితే సీఎస్‌కే టీమ్‌లో ఎలాంటి వివాదాలు లేవని రైనా, శ్రీనివాసన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 2020 (సెప్టెంబర్‌ 19నుంచి నవంబర్‌ 10) వరకు జరగనుంది.
చదవండి: ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు