తెలుగు టైటాన్స్‌కు నిరాశ

7 Dec, 2023 00:28 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్‌ తరఫున కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ 11 పాయింట్లతో రాణించాడు.

పట్నా తరఫున సచిన్‌ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 57–27తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్‌ తరఫున సురేందర్‌ 13 పాయింట్లు, ప్రదీప్‌ నర్వాల్‌ 12 పాయింట్లు స్కోరు చేశారు.  

>
మరిన్ని వార్తలు