Cristiano Ronaldo: రికార్డుల రొనాల్డో.. చేతికున్న వాచీ ఖరీదు అంతా?

27 Jun, 2021 12:49 IST|Sakshi

సెలబ్రిటీలను ఆరాధించడానికి.. అభిమానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనక్కర్లేదు. నచ్చితే.. బ్లయిండ్‌గా ఫాలో అయిపోవడమే. ఫుట్‌బాల్‌ ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్‌ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రొనాల్డో.. సోషల్‌ మీడియాలోనూ రికార్డుల బ్రేకర్‌ కూడా. 

వెబ్‌డెస్క్‌: సాకర్‌ వీరుడు రొనాల్డోకు ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య 92.4 మిలియన్లు. ఫేస్‌బుక్‌లో 148 మిలియన్ల ఫాలోవర్లు. ఇక ఈమధ్యే ఇన్‌స్టాలో 30 కోట్ల మిలియన్‌ ఫాలోవర్స్‌ రికార్డు దక్కించుకున్నాడు. కేవలం ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారానే దాదాపు 2 మిలియన్ల పౌండ్ల ఆదాయం వెనకేసుకుంటున్నాడు. అతను వేసే ఒక్కో పోస్టుకి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తోంది(మోడల్‌ కైలీ జెన్నర్‌ పోస్ట్‌కి ఎనిమిది కోట్లకుపైనే). ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో ఆటగాడు ఇతనే. మరో విశేషం ఏంటంటే.. లాక్‌డౌన్‌ టైంలోనూ అత్యధికంగా సంపాదించిన అథ్లెట్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచాడు.

కాస్ట్‌లీ యవ్వారం
ఈ జువెంటస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడి.. విలాసాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా డైట్‌ను ఫాలో అయ్యే 36 ఏళ్ల రొనాల్డో.. ఫిట్‌నెస్‌ విషయంలో అభిమానులకు ఆరాధ్యుడే. దుబాయ్‌ గ్లోబ్‌ సాకర్‌ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో ఒక రోలెక్స్‌ వాచీతో హాజరయ్యాడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? దానిని స్కాన్‌ చేసి ధరెంతో కనుక్కునే ప్రయత్నం చేశాడు. రీసెంట్‌గా ఆ వాచీ కంపెనీ ‘స్విస్‌’.. దాని ధరెంతో ప్రకటించింది. 18 క్యారెట్ల వైట్‌ గోల్డ్‌తో తయారుచేసిన వాచీ అది. అందులో 30 క్యారెట్ల వైట్‌ డైమండ్లు పొదిగిన ఆ వాచీ ఖరీదు 3,71,000 పౌండ్లు (మన కరెన్సీలో 3 కోట్ల 82 లక్షలపైనే) విలువ ఉందని ప్రకటించింది. పైగా ఇలాంటి పీస్‌ ఇప్పటివరకు ఈ ఫుట్‌బాల్‌ స్టార్‌ దగ్గర మాత్రమే ఉందని వెల్లడించింది.

బ్రాండ్‌ బాబు  
రొనాల్డ్‌ బ్రాండ్‌ అంబాసిడరింగ్‌ వాల్యూ ఏటా దాదాపు 105 మిలియనల​ డాలర్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందులో నైక్‌ నుంచే 45 మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక సొంతంగా సీఆర్‌7 బ్రాండ్‌ ఉంది.

ఓవరాల్‌ ఆటగాళ్ల ఆదాయం జాబితాలో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్టిస్ట్‌ కనోర్‌ మెక్‌గ్రెగోర్‌(180 మిలియన్ల డాలర్లు), లియోనెల్‌ మెస్సీ(130 మిలియన్ల డాలర్లు).. ఉండగా మూడో ప్లేస్‌లో రొనాల్డో 120 మిలియన్ల డాలర్లతో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి మెస్సీ కంటే టోటల్‌ ఆదాయంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బ్రాండ్‌ ఆదాయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు రొనాల్డో.

ఫిబ్రవరి 5, 1985 సాంటో అంటోనియోలో పుట్టాడు రొనాల్డో. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో పెద్దగా చదువుకోని రొనాల్డో.. 17వ ఏట స్పోర్ట్స్‌ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా తీసుకున్నాడు. ది సుల్తాన్‌ ఆఫ్‌ ది స్టెప్‌ఓవర్‌ బిరుదు అందుకున్నాడు. మెర్చ్‌ రొమిరో, గెమ్మా అటిక్‌సన్‌,  ఇరినా షాయ్క్‌లతో డేటింగ్‌ చేసి.. మోడల్‌ జార్జినా రోడ్రిగుజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. 

    

చదవండి: రొనాల్డో వల్లే కోకా కోలా 29వేల కోట్లు నష్టపోయిందా?.. అందులో నిజమెంత?

మరిన్ని వార్తలు