బంతిని తన్నబోయి కెమెరా ఉమెన్‌పైకి దూసుకెళ్లాడు; వీడియో వైరల్‌

21 Aug, 2021 13:16 IST|Sakshi

డచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఫెయినూర్డ్, స్వీడీష్‌ క్లబ్‌ ఎల్ఫ్స్‌బోర్గ్ మధ్య గురువారం రాత్రి లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరానియన్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు అలీరెజా జాహన్‌బక‌్ష్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఎల్స్ఫ్‌బోర్గ్‌ డిపెండర్‌ సైమన్‌ స్టాండ్‌ ఫుట్‌బాల్‌ను తన్నే క్రమంలో సైడ్‌లైన్‌ మీదకు వచ్చేవాడు. అప్పటికే బంతిని తన్నిన సైమన్‌ వేగాన్ని అదుపు చేసుకోలేక అక్కడే ఉన్న కెమెరా ఉమెన్‌పైకి దూసుకెళ్లాడు. అయితే అదృష్టం బాగుండి ఆ మహిళ పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినా కెమెరా మాత్రం తలకిందులు అయింది.

ఆ సమయంలో పక్కనే ఉన్న అలీరెజా సైమన్‌ను పక్కకు తీసుకెళ్లి ''ఏంటిది.. ఎందుకంత స్పీడు'' అన్నట్టుగా అక్కడినుంచి పంపించేశాడు. అనంతరం కెమెరా ఉమెన్‌ వద్దకు వచ్చి కెమెరాను సర్ది.. ఏం కాలేదుగా అని అడిగాడు. అందుకు ఆ మహిళ నాకేం పర్లేదు.. అని చెప్పింది. అయితే అలీరెజా చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేశారు. కాగా జాహన్‌బక‌్ష్‌  2014, 2018 ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లలో ఇరాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జాహన్‌బక‌్ష్‌ ఒక గోల్‌ చేయగా.. ఫెయినూర్డ్ 5-0 తేడాతో ఎల్స్ఫోబోర్గ్‌పై ఘన విజయాన్ని అందుకుంది.   

చదవండి: Manan Sharma: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్‌

Mohammed Siraj: సిరాజ్‌ సెలబ్రేషన్స్‌ వైరల్‌; హైదరాబాద్‌లో భారీ కటౌట్‌

మరిన్ని వార్తలు