చిరంజీవి బర్త్‌డే: రేపు రానున్న క్రేజీ ఆప్‌డేట్‌

21 Aug, 2021 13:20 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే నేపథ్యంలో ఆయన సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్దమయ్యారు. ఆగ‌స్ట్ 22న చిరంజీవి 66వ వసంతంలోకి  అడుగు పెడుతున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు, సినీ సెలబ్రెటీలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిరు ఇటివల ఆచార్య మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని లూసిఫ‌ర్ రీమేక్ మొద‌లు పెట్టిన సంగతి తెలిసిందే.

చదవండి: తండ్రి బర్త్‌డేకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల

త్వ‌ర‌లో వేదాళం రీమేక్ చేయ‌నున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌బోతున్నారు ఆయన. ఆగష్టు 22(ఆదివారం) ఆయన పుట్టిన రోజు సందర్భంగా  రేపు ఉద‌యం 9గం.ల‌కు మెహ‌ర్ ర‌మేష్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌నను మేకర్స్‌ విడుదల చేశారు. మెగా వేలో మెగాస్టార్ బ‌ర్డ్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోండి ఇలా అని తమ ట్వీట్‌లో మేకర్స్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు