Ind Vs Sa: టీమిండియాకు భారీ షాకిచ్చిన ఐసీసీ

24 Jan, 2022 15:06 IST|Sakshi

టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైన భారత జట్టుకు.... వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో 4 పరుగుల తేడాతో ప్రొటిస్‌ విజయం సాధించడంతో వైట్‌వాష్‌ తప్పలేదు. ఇక ఈ  ఓటమి భారంతో నిరాశలో ఉన్న టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా రాహుల్‌ సేనకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత పెట్టింది. 

ఐసీసీ నియావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం... నిర్దేశిత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ ఓవర్లు వేసిన కారణంగా ఈ మేరకు ఫైన్‌ విధించినట్లు పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటన టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. టెస్టు, వన్డే సిరీస్‌లో కలిపి మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడగా... టీమిండియా కేవలం ఒక్క టెస్టు మాత్రమే గెలవడం గమనార్హం. దీంతో హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు, రోహిత్‌ గైర్హాజరీలో తొలిసారి వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌కు భంగపాటు తప్పలేదు.

మూడో వన్డే స్కోర్లు:
దక్షిణాఫ్రికా- 287 (49.5)
ఇండియా- 283 (49.2)

చదవండి: Ind Vs SA - Deepak Chahar: గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న దీపక్‌ చహర్‌.. వైరల్‌

మరిన్ని వార్తలు