India Vs England 5T​h Test: మూడోరోజు ముగిసిన ఆట.. భారత్‌ 125/3

3 Jul, 2022 14:22 IST|Sakshi

టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. చతేశ్వర్‌ పుజారా 50, రిషబ్‌ పంత్‌ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 257 పరుగుల ఆధిక్యంలో ఉంది.

13 ఓవర్లకి 37/1
ఆరంభంలో వికెట్‌ పడినా ప్రస్తుతం భారత్‌ ఆచితూచి ఆడుతోంది. 13 ఓవర్లకి భారత్‌ స్కోరు 37/1 (టీ బ్రేక్‌)

మొదటి ఓవర్లోనే మొదటి వికెట్‌
రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ తొలి ఓవర్లోనే శుభమన్‌ గిల్‌ (4) వికెట్‌ని కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో చోటేశ్వర పుజారా (15), హనుమాన్‌ విహారీ(2) ఉన్నారు. భారత్‌ స్కోరు  9 ఓవర్లకి 27/1

 ఇంగ్లండ్‌ ఆలౌట్‌..
భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లండ్‌ 284 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ని ముగించింది. 

స్టువర్ట్‌ బ్రాడ్‌ ఔట్‌! ఇంగ్లండ్‌ స్కోరు 250/8
బెయిర్‌ స్టో కావడంతో క్రీజులోకి వచ్చిన స్టువర్ట్‌ బ్రాడ్‌ 1(5) వెంటనే వెనుతిరిగాడు. ప్రస్తుతం బిల్లింగ్‌, మ్యాటీ పాట్స్‌ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ స్కోరు 56 ఓవర్లకు 250/8

బెయిర్‌ స్టో ఔట్‌! ఇంగ్లండ్‌ స్కోరు 247/7
కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న స్టార్‌ బ్యాటర్‌ బెయిర్‌ స్టో 106 (140) ఔటయ్యాడు. ప్రస్తుతం బిలి​ంగ్స్‌ 25 (48), స్టువర్ట్‌ బ్రాడ్‌ 1 (3) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ స్కోరు 55 ఓవర్లకు 247/7.

బెయిర్‌ స్టో సెంచరీ.. 48 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 227/6
కీలక సమయంలో జట్టును ఆదుకున్న బెయిర్‌ స్టో సెంచరీ (119 బంతులు) సాధించాడు. బిల్లింగ్స్‌ 20 (27) క్రీజులో ఉన్నాడు. ఈ ఓవర్లో 12 పరుగులు సమర్పించుకున్న టాకూర్‌.. మొత్తంగా 6 ఓవర్లు బౌలింగ్‌ చేసి 40 పరులు ఇచ్చాడు. ఒక వికెట్‌ తీశాడు. ఇంగ్లండ్‌ ఫాలో ఆన్‌ తప్పించుకుంది.

46.3 ఓవర్లు.. వర్షంతో ఆగిన ఆట
మళ్లీ వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు లంచ్‌ విరామం ప్రకటించారు. బెయిర్‌ స్టో సెంచరీకి చేరువయ్యాడు. 112 బంతుల్లో 91 పరుగులు చేశాడు. సామ్‌ బిల్లింగ్స్‌ 7 (17) అతనితోపాటు క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్కోరు 200/6

42 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 178/6
42 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌ స్టో(72), సామ్‌ బిల్లింగ్స్‌(6) పరుగులతో ఉన్నారు.
ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
149 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన స్టోక్స్‌.శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 38 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌: 153/6
34 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 121/5
34 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌ స్టో (31), బెన్‌ స్టోక్స్‌(17) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

29 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 90/5
29 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌ స్టో 12, బెన్‌ స్టోక్స్‌(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

మూడో రోజు ఆట ప్రారంభం
84/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇంగ్లండ్‌ మూడో రోజు ఆటను ప్రారంభించింది. క్రీజులో బెయిర్‌ స్టో 12, బెన్‌ స్టోక్స్‌(0) క్రీజులో ఉన్నారు. 

మరిన్ని వార్తలు