మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కోచ్‌ కన్నుమూత

14 Feb, 2023 17:32 IST|Sakshi

మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కోచ్‌.. బరోడా మాజీ రంజీ ఆటగాడు నారాయణ్‌ రావు సాథమ్‌(73) కన్నుమూశారు. ఆదివారం ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.  1970,80వ దశకంలో బరోడా తరపున దేశవాలీ క్రికెట్‌లో బెస్ట్‌ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దులీప్‌ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్‌కు ఆడుతున్న సమయంలో సునీల్‌ గావస్కర్‌, అశోక్‌ మన్కడ్‌, అజిత్‌ వాడేకర్‌లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ షేర్‌ చేసుకున్నాడు.

ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన నారాయణ్‌ సాథమ్‌ ఎంతో మంది క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. అలా వచ్చినవారే కిరణ్‌ మోరే, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌లు. కాగా నారాయణ్‌ సాథమ్‌ మృతిపై మాజీ క్రికెటర్‌ కిరణ్‌ మోరే ఎమోషన్‌ అయ్యాడు. ట్విటర్‌ వేదికగా కిరణ్‌ మోరే స్పందించాడు.  

''నా జీవితంలో ఈరోజు చాలా దుర్దినం. నా మెంటార్‌, కోచ్‌, గురువు నారాయణ్‌ రావు సాథమ్‌ కన్నుమూశారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణం. నా గురువును చాలా మిస్సవుతున్నా.. బరోడా జట్టుకు ఇది పెద్ద నష్టం అని చెప్పుకోవాలి'' అంటూ ట్వీట్‌ చేశాడు. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో నారాయణ్‌ సాథమ్‌  84 మ్యాచ్‌లాడి 3119 పరుగులతో పాటు 193 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఫకర్‌ జమాన్‌

ప్రపంచానికి తెలియని ఆసీస్‌ క్రికెటర్ల ప్రేమకథ

మరిన్ని వార్తలు