నువ్వస్సలు మారొద్దు: గంభీర్‌ పోస్ట్‌ వైరల్‌.. సెటైర్లతో కోహ్లి ఫ్యాన్స్‌ కౌంటర్‌

23 Sep, 2023 18:27 IST|Sakshi
కోహ్లితో నవీన్‌ గొడవ- నవీన్‌తో గంభీర్‌ (PC: IPL/BCCI)

There are very few like you, never change: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ను విరాట్‌ కోహ్లి అభిమానులు మరోసారి టార్గెట్‌ చేశారు. మీ ఎక్స్‌ట్రాలన్నింటికి ఢిల్లీలో మా కింగ్‌ బ్యాట్‌తోనే సమాధానమిస్తాడంటూ చురకలు అంటిస్తున్నారు. మీ స్టాండ్‌ అస్సలు మారొద్దు.. అలాగే ఉండాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2023లో ల​‍క్నోలో ఆర్సీబీ- లక్నో సూపర్‌ జెయింట్స్ మ్యాచ్‌‌  సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి- అఫ్గన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్నో బౌలర్‌కు మద్దతుగా ఆ జట్టు మెంటార్‌ గౌతం గంభీర్‌ మైదానంలోకి వచ్చాడు.

గంభీర్‌ జోక్యంతో ముదిరిన గొడవ
కోహ్లితో గొడవపడుతున్న నవీన్‌ను సమర్థించేలా మాట్లాడటంతో కోహ్లి కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. భారత మాజీలు సహా మిగతా క్రికెటర్లు సైతం ఈ విషయంలో గంభీర్‌ను తప్పుబట్టారు. 

మైదానంలో ఆటగాళ్లు మాటా మాటా అనుకోవడం సహజమేనని.. అంతమాత్రాన కోచ్‌ స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా మధ్యలో దూరిపోకూడదని విమర్శించారు. అయితే, నవీన్‌ కోహ్లితో గొడవను అక్కడితో ముగించలేదు. మ్యాంగోస్‌ పోస్టులతో కోహ్లి, కోహ్లి ఫ్యాన్స్‌ కవ్వించగా.. అదే స్థాయిలో ట్రోల్స్‌ కూడా ఎదుర్కొన్నాడు.

నువ్విలాగే ఉండాలి.. మారొద్దు
ఇదిలా ఉంటే.. నవీన్‌ ఈరోజు(సెప్టెంబరు 23) ఇరవై నాలుగవ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా గంభీర్‌ సోషల్‌ మీడియా వేదికగా అతడికి విషెస్‌ తెలియజేశాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే నవీన్‌.. అతి కొద్ది మంది మాత్రమే నీలా ఉండగలుగుతారు. నువ్విలాగే ఉండాలి. ఎప్పటికీ మారొద్దు’’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.

ఢిల్లీలో టీమిండియాతో మ్యాచ్‌
ఈ పోస్ట్‌పై కోహ్లి ఫ్యాన్స్‌ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పైవిధంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవీన్‌ ఉల్‌ హక్‌ను అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2023కి ఎంపిక చేశారు అఫ్గనిస్తాన్‌ సెలక్టర్లు.

ఈ క్రమంలో అక్టోబరు 11న టీమిండియాతో ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌ జట్టు తలపడనుంది. కోహ్లి హోం గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ జరుగనుండటంతో నవీన్‌ బౌలింగ్‌ను చెడుగుడు ఆడేస్తాడంటూ ఫ్యాన్స్‌ గంభీర్‌ పోస్టుకు బదులిస్తున్నారు.

చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త!

A post shared by Gautam Gambhir (@gautamgambhir55)

మరిన్ని వార్తలు