NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్‌ దిశగా వెస్టిండీస్‌

13 Aug, 2022 10:18 IST|Sakshi

వెస్టిండీస్‌ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. ఇటీవలే టీమిండియాతో జరిగిన టి20 సిరీస్‌ను 0-3తో వైట్‌వాష్‌ చేసుకున్న వెస్టిండీస్‌.. తాజాగా కివీస్‌తో సిరీస్‌లోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే తొలి టి20లో పరాజయం పాలైన వెస్టిండీస్‌.. శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లోనూ 90 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌(41 బంతుల్లో 76 పరుగులు, 4 ఫోర్లు, 6 సిక్సర్లు), డారిల్‌ మిచెల్‌(20 బంతుల్లో 48 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. కాన్వే 34 బంతుల్లో 42 పరుగులు చేశాడు. విండీస్‌ బౌలర్లలో ఒబెద్‌ మెకాయ్‌ 3, షెపర్డ్‌, ఓడియన్ స్మిత్‌ చెరొక వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. విండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మెన్‌ పావెల్‌ ఒక్కడే 20 పరుగుల మార్క్‌ను అందుకోగా.. మిగతావారు విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌, మైకెల్‌ బ్రాస్‌వెల్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. ఇష్‌ సోది, టిమ్‌ సౌతీ చెరొక వికెట్‌ తీశారు. ఈ విజయంతో న్యూజిలాండ్‌ మూడు టి20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలచింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆగస్టు 14న జరగనుంది.

చదవండి: Andre Russell: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్‌ కోచ్‌; రసెల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్‌లో తొలి బౌలర్‌గా

మరిన్ని వార్తలు