'అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది'

8 Jun, 2021 11:50 IST|Sakshi

లండన్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఈ తరం అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. టీమిండియా తరపున ఆడుతున్న అశ్విన్‌ జట్టుకు ఎన్నో కీలక విజయాలు సాధించిపెట్టాడు. ఇటీవలే ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌.. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్‌ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన అశ్విన్ కెరీర్‌లో మొత్తం 30సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీసి అత్యుత్తమ స్పిన్నర్‌గా నిలిచాడు.

అయితే  అశ్విన్ మంచి స్పిన్న‌రే కావ‌చ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒక‌డు మాత్రం కాద‌ని కామెంటేటర్‌ మంజ్రేక‌ర్ ఒక ఇంటర్య్వూలో అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో రాణిస్తాడనే పేరున్న అశ్విన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాలో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడ‌ని పేర్కొన్నాడు. అందువల్ల అశ్విన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపాడు. దీనికి సంబంధించి మంజ్రేకర్‌ ఆదివారం ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపాడు.

మంజ్రేకర్‌ కామెంట్స్‌పై రవిచంద్రన్‌ అశ్విన్‌ తనదైన శైలిలో పంచ్‌ ఇచ్చాడు. త‌మిళ బ్లాక్‌బాస్టర్‌ సినిమా అన్నియ‌న్ (అప‌రిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్‌ చేశాడు. 'అప్డి సొల్లాదా చారీ.. మ‌న‌సెల్ల‌మ్ వ‌లికిర్దు (అలా అన‌కు చారీ.. నా మ‌న‌సు బాధ‌ప‌డుతుంది) అనే డైలాగ్‌ను షేర్‌ చేశాడు. అశ్విన్‌ పెట్టిన ఈ పోస్టు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.కాగా అశ్విన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు ఇప్పటికే టీమిండియాతో కలిసి ఇంగ్లండ్‌కు చేరుకొని క్వారంటైన్‌లో ఉన్నాడు. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌, భారత్‌ల మధ్య చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్‌ క్రికెటర్‌పై వేటు పడనుందా! 

అశ్విన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్పిన్నర్‌ అంటే ఒప్పుకోను..

మరిన్ని వార్తలు