‘అక్తర్‌ నన్ను చంపుతానన్నాడు’

10 Aug, 2020 16:04 IST|Sakshi
హేడన్‌-అక్తర్‌(ఫైల్‌ఫోటో)

బంతులతో చుక్కలు చూపిస్తానన్నాడు

ట్రై చేయమని సవాల్‌ విసిరా: హేడెన్‌

సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ విషయంలో ఆస్ట్రేలియాకు ఆ జట్టే సాటి. ప్రత్యర్థి జట్టును ముందుగానే తన వ్యాఖ్యలతో  భయపెట్టడంలో కానీ, ఫీల్డ్‌లో దిగాక స్లెడ్జ్‌ చేయడంలో కానీ ఆసీస్‌ క్రికెటర్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారనేది అ‍ందరికీ తెలిసిన విషయం. ఇందులో ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ బాగా ఆరితేరిన వాడు. అయితే అదే హేడెన్‌ను పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ భయపెట్టాలని చూశాడట. 2002లో యూఏఈలో  జరిగిన టెస్టు మ్యాచ్‌ సందర్భంగా తనను చంపుతానని అక్తర్‌ భయపెట్టిన విషయాన్ని హేడెన్‌ చెప్పకొచ్చాడు. అయితే దీన్ని ఘనంగా తాను స్వాగితించినట్లు హేడెన్‌ తెలిపాడు.(‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’)

ఇది మ్యాచ్‌కు ముందు ఒకానొక సందర్భంలో జరగిందని హేడెన్‌ తెలిపాడు. కాగా, మ్యాచ్‌ మొదలయ్యాక అక్తర్‌ బౌలింగ్‌ రనప్‌ తీసుకునే క్రమంలోనే తిట్ల దండకం అందుకునే వాడన్నాడు. అయితే ఇలా రనప్‌ చేస్తూ బ్యాట్స్‌మన్‌ ఏకాగ్రతను దెబ్బతీయడానికి యత్నించిన అక్తర్‌పై ఫిర్యాదు చేయడమే కాకుండా అతనికి 18 బంతులు సమయం కూడా ఇచ్చినట్లు తెలిపాడు. తనను చంపుతానన్న చాలెంజ్‌కు మూడు ఓవర్ల సమయం ఇచ్చినట్లు తెలిపాడు. తనను ఔట్‌ చేసి విమానం గాల్లో ఎగిరినట్లు సంబరాలు చేసుకో​ అని సూచింనట్లు కూడా తెలిపాడు. తన దృష్టిలో అక్తర్‌ ఒక బి-గ్రేడ్‌ యాక్టర్‌ అని హేడెన్‌ తెలిపాడు. అయితే బౌలింగ్‌ రనప్‌ చేస్తూ దూషించడాన్ని తీవ్రంగా పరిగణించానన్నాడు. అప్పుడు అంపైర్‌గా ఉన్న వెంటకరాఘవన్‌కు విషయాన్ని సీరియస్‌గా వివరించానన్నాడు. గేమ్‌లో ప్రతీది ఇస్తా. ప్రతీ దానికి కట్టుబడి ఉంటా. కానీ ఏది చేసినా గేమ్‌ ప్రొటోకాల్‌కు లోబడే ఉండాలి. నువ్వు పరుగెడుతూ దూషించడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. నేను అంతకంటే ఎక్కువ చేస్తా. నాకు అక్తర్‌తో సమస్య ఉంది’ అని చెప్పినట్లు హేడెన్‌ తెలిపాడు.  ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హేడెన్‌ 119 పరుగులు చేసి ఆసీస్‌ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఆ మ్యాచ్‌ను ఆసీస్‌ ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచింది. 

మరిన్ని వార్తలు