Dravid- Shreyas Iyer: 'ద్రవిడ్‌ సర్‌ ముందే చెప్పారు.. అందుకే'

28 Nov, 2021 20:02 IST|Sakshi

Shreyas Iyer Reveals What Rahul Dravid Instructed.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా శ్రేయాస్‌ అయ్యర్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీతో మెరిసిన అయ్యర్‌ టీమిండియాకు మంచి ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో నాలుగోరోజు ఆట ముగిసిన అనంతరం అయ్యర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పిన విషయాలను పేర్కొన్నాడు. 

చదవండి: Shreyas Iyer: శ్రేయాస్‌ అయ్యర్‌కు టీమిండియా అరుదైన గౌరవం  

''ఏమైనా న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌ను గెలవడమే మనకు ముఖ్యం. నువ్వు క్రీజులో వీలైనంత ఎక్కువగా గడపాలి.. మిడిల్‌ ఓవర్స్‌లో ఎంత గట్టిగా నిలబడితే అన్ని పరుగులు వస్తాయన్నారు. నేను కూడా మైండ్‌లో అదే పెట్టుకొని ఇన్నింగ్స్‌ను నడిపించడానికి ప్రయత్నించా.. అలా రెండు సెషన్ల పాటు ఓపికతో బ్యాటింగ్‌ చేసి టీమిండియాకు మంచి ఆధిక్యం ఇవ్వడంలో కృషి చేశా. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం లేదు.. ప్రస్తుతం ఆటపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టాను. నిజాయితీగా చెప్పాలంటే వికెట్‌ కాస్త కఠినంగా ఉంది. 275 నుంచి 280 పరుగుల ఆధిక్యం లభిస్తే మంచిదని భావించాం. అనుకున్నట్లుగానే మంచి లీడ్‌ రావడంతో కివీస్‌ను నాలుగోరోజు ఆఖర్లోనే బ్యాటింగ్‌ దింపాం. ఇ‍ప్పటికే ఒక వికెట్‌ తీసిన మాకు మ్యాచ్‌ విజయానికి 9 వికెట్ల అవసరం ఉంది.

డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ.. హాఫ్‌ సెంచరీతో మెరవడం సంతోషంగా ఉంది. ప్రతీ క్రికెటర్‌ డెబ్యూ మ్యాచ్‌ను గొప్పగా మలుచుకోవాలని భావిస్తారు. నాకు ఆ అదృష్టం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: Tim Southee: కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన సౌథీ

మరిన్ని వార్తలు