Sourav Ganguly: అనిల్‌ కుంబ్లే స్థానంలో గంగూలీ.. ఇంతకీ ఆ కమిటీ ఏం చేస్తుంది?

18 Nov, 2021 07:17 IST|Sakshi

BCCI president Sourav Ganguly replaces Anil Kumble as chairman of ICC Men’s Cricket Committee: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) పురుషుల క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే స్థానంలో కొత్త బాస్‌గా గంగూలీ పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా సుదీర్ఘకాలంలో ఈ పదవిలో కొనసాగుతున్న అనిల్‌ కుంబ్లే పదవీ కాలం ముగియడంతో ఐసీసీ ఈ మేరకు అతడి స్థానాన్ని గంగూలీతో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

కాగా టీమిండియా సారథిగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన గంగూలీకి క్రికెట్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా ఆటగాడిగానే కాకుండా... క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడిగా తొలుత సేవలు అందించిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలు అందించనున్నాడు.

ఈ కమిటీ ఏం చేస్తుంది... 
ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ)కి ఇది సబ్‌–కమిటీ. క్రికెట్‌ ఆట విషయాలను చర్చిస్తుంది. అంపైర్లు, రిఫరీల నిర్ణయాలు, ఆటలో సాంకేతికత వినియోగం, శాశ్వత హోదా దరఖాస్తులు,  అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌లపై వచ్చే ఫిర్యాదుల్ని సమీక్షించి సీఈసీకి సిఫార్సు చేస్తుంది.  

చదవండి: Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్‌!
Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్‌ కావడమే ఎంతో సంతోషం!

మరిన్ని వార్తలు