పంత్‌, డసెన్‌ల గొడవ.. ‘నీ కంటే ఐదేళ్లు చిన్నవాడి వెంట పడ్డావు.. పైగా’.. కోహ్లి రాకతో..

14 Jan, 2022 23:25 IST|Sakshi

సౌతాఫ్రికాతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఓటమితో టీమిండియా సౌతాఫ్రికా గడ్డపై సిరీస్‌ గెలవాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే మూడో టెస్టులో డీన్‌ ఎల్గర్‌ ఔట్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి లైన్‌మీద వెళుతున్నప్పటికి ఆఫ్‌స్టంప్‌ బెయిల్‌కు తాకకుండా కనిపించడం దుమారం రేపింది. ఈ విషయంలో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు స్టంప్స్‌ మైక్‌ ద్వారా బ్రాడ్‌కాస్టింగ్‌ చానెల్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటన మరువకముందే కోహ్లి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు

విషయంలోకి వెళితే..  మహ్మద్‌ షమీ వేసిన బంతి వాండర్‌ డసెన్‌ ప్యాడ్లకు తాకింది. అయితే అప్పీల్‌ విషయంలో క్లారిటీ లేకపోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఫీల్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేయలేదు. ఆ తర్వాత ఆటగాళ్లు ఎవరి స్థానాలకు వారు వెళుతున్న సమయంలో కోహ్లి.. వాండర్‌ డసెన్‌తో చాట్‌ చేశాడు. అప్పటికే పంత్‌, డసెన్‌ల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఇది విన్న కోహ్లి.. డసెన్‌తో..''నీ కంటే ఐదేళ్లు చిన్నవాడి వెంట పడ్డావు.. పైగా నాతోనే మీరు రిషబ్‌ను స్లెడ్జ్‌ చేస్తారా '' అని అడుగుతావా అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన అంశం అక్కడి స్టంప్స్‌ మైక్‌లో రికార్డయింది.

ఇక నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్‌ పీటర్సన్‌(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్‌(41 నాటౌట్‌), బవుమా(32 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

చదవండి:  లడ్డు లాంటి క్యాచ్‌ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి

మరిన్ని వార్తలు