World Cup 2022 Ind W Vs Ban W: నిరాశ పరిచిన మిథాలీ రాజ్‌.. రాణించిన మంధాన, షఫాలీ, యస్తికా

22 Mar, 2022 10:03 IST|Sakshi

ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు సాధించింది. కాగా హామిల్టన్‌ వేదికగా సాగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) శుభారంభం అందించారు. దీంతో 14 ఓవర్లలో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. అయితే, బంగ్లా బౌలర్‌ నహీదా అక్తర్‌ మంధానను అవుట్‌ చేయగా.. రీతూ మోనీ వరుసగా రెండు వికెట్లు పడగొట్టింది. ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(0)ను పెవిలియన్‌కు పంపింది. 

A post shared by ICC (@icc)

దీంతో ఐదు పరుగుల వ్యవధిలోనే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యస్తికా భాటియా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడింది. అర్ధ శతకం సాధించింది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(14), రిచా ఘోష్‌(26), పూజా వస్త్రాకర్‌(30), స్నేహ్‌ రాణా(27) పరుగులు సాధించారు. ఈ క్రమంలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్‌ 2, జహనారా ఆలం ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు