పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

6 Jan, 2022 11:16 IST|Sakshi

వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌-2022కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్‌ల లిస్ట్‌లో ఉన్నారు.

ఇక ఈ మెగా టోర్నమెంట్‌ మార్చి 4న బే ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్‌ తలపడనుంది. ఇక మార్చి 4న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా భారత్‌ ఈసారి టైటిల్‌ బరిలో హాట్‌ ఫేవరేట్‌ దిగనుంది.

భారత జట్టు:  మిథాలీ రాజ్ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన , షఫాలి వర్మ, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్‌ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్ యాదవ్‌
స్టాండ్‌బై: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్

చదవండి: SA Vs IND: ఎవరీ అల్లావుద్దీన్ పాలేకర్.. భారత్‌తో ఏంటి సంబంధం ?

మరిన్ని వార్తలు