లైగింక వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు

17 Aug, 2023 02:00 IST|Sakshi
ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతులు

తిరువళ్లూరు: ఉన్నత ఉద్యోగుల నుంచి తరచూ ఎదురవుతున్న లైగింక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధిత యువతులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తొడుగాడు గ్రామంలో కార్లకు బ్రేక్‌, తాళం తయారు చేసే సంస్థ ఉంది. ఈ సంస్థకు దక్షణ కొరియాకు చెందిన కియాంగ్‌ జూ లీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఽహేమావతి, ధనశేఖర్‌ తదితరులు మేనేజర్‌లుగా పని చేస్తున్నారు.

కంపెనీలో సుమారు 100 మంది యువతులు పని చేస్తున్నారు. కాగా కంపెనీలో పని చేసే యువతులకు కియాంగ్‌ జూలీ తరచూ లైగింక వేధింపులకు గురి చేస్తున్నాడని యువతులు వాపోయారు. వేధింపులపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు ఎస్పీ మీనాక్షికి వినతి పత్రం సమర్పించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు