దసరా వరకు పరీక్షలు వాయిదా

21 Oct, 2020 01:50 IST|Sakshi

ట్విట్టర్‌లో మంత్రి సబిత వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్‌టీయూ వెల్లడించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు