CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

5 May, 2021 15:29 IST|Sakshi

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 05

కన్సల్టెంట్‌(రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌): అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: 3ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50 ఏళ్లు మించకూడదు.

కన్సల్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): అర్హత: గ్రాడ్యుయేషన్‌(కామర్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. 5ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు. వయసు: 64 ఏళ్లు మించకూడదు.

సైకాలజిస్ట్‌: అర్హత: ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 4ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50ఏళ్లు మించకూడదు.

హిందీ ట్రాన్స్‌లేటర్‌: అర్హత: హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి. డిప్లొమా(ట్రాన్స్‌లేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు.

కన్సల్టెంట్‌ లైబ్రేరియన్‌: అర్హత: డిగ్రీ(లైబ్రరీ సైన్సెస్‌) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు.

► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్‌: http://www.cdfd.org.in

మరిన్ని నోటిఫికేషన్లు
EFLU Recruitment: ఇఫ్లూలో టీచింగ్‌ పోస్టులు

పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో 38 టెక్నికల్‌ ఉద్యోగాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు