మబ్బులు మసకేసి.. ఆకాశం ముసుగేసి.. 

21 Sep, 2022 08:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో మంగళవారం గ్రేటర్‌ సిటీని కారుమబ్బులు కమ్మేశాయి. గరిష్టంగా 27.8 డిగ్రీలు, కనిష్టంగా 21.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు గాలిలో తేమ 83 శాతానికి చేరుకోవడంతో పాటు చలిగాలులు సిటీజన్లను వణికించాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. 

గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ వద్ద సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రోగులు, శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు.    

(చదవండి: రాష్ట్రంలో భారీ వర్షాలు)

మరిన్ని వార్తలు