బల్దియా బడ్జెట్‌ రూ.6150 కోట్లు

13 Apr, 2022 18:42 IST|Sakshi

రహదారులకే అధిక ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌: రహదారుల మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిస్తూ వాటికే ఎక్కువ నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.6150 కోట్లతో జీహెచ్‌ఎంసీ 2022–23 బడ్జెట్‌ను ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీంగా ఆమోదించారు. ఏ, బీలుగా బడ్జెట్‌ను రూపొందించినప్పటికీ, కేవలం ‘ఏ’లోని జీహెచ్‌ఎంసీకి చెందిన నిధులనే సమావేశంలో ప్రస్తావించి ఆమోదం తెలిపారు.

అభివృద్ధి, మౌలికవసతులకు ప్రాధాన్యమిచ్చినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. వరద నివారణ పనులకు రూ.540 కోట్లు ఖర్చు చేయనున్నారు. . మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు, వైకుంఠ ధామాలు, ఎప్‌ఓబీలు, మోడర్న్‌ మార్కెట్లు, థీమ్‌పార్కులు తదితరమైన వాటికి ప్రాధాన్యమిచ్చారు. 

కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఎస్సార్‌డీపీ పనులతోపాటు ఇంజినీరింగ్‌ మెయింటెనెన్స్‌ పనులకు సైతం ఎక్కువ నిధులే చెల్లించామన్నారు. 70 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లు పూర్తయ్యాయని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేవారి కోసం రాష్ట్రబడ్జెట్‌లోని కేటాయింపుల్లో జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ. 700 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఎన్‌డీపీ పనులకు రూ. 400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. (క్లిక్‌: బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు)

మరిన్ని వార్తలు