వివస్త్రను చేసి వేధించారు.. 

22 Jan, 2022 03:28 IST|Sakshi

అటవీ సిబ్బందిపై గొత్తికోయ మహిళల ఆరోపణ 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

ములకలపల్లి: వంట చెరుకు కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తమపై అటవీ సిబ్బంది దాడికి పాల్పడ్డారని గొత్తికోయ మహిళలు ఆరోపించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళలు శుక్రవారం వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సాకివాకి గుంపులో సుమారు 20 వలస గొత్తికోయ కుటుంబాలు నివాసముంటున్నాయి.

ఇందులో కొందరు మహిళలు వంటచెరుకు తెచ్చుకునేందుకు బుధవారం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లా రు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్‌బీఓ మహేశ్, ఇతర సిబ్బంది తమపై అకారణంగా దాడి చేశారని బాధిత మహిళ లు వెల్లడించారు. వారి నుంచి తప్పిం చుకునే ప్రయ త్నంలో ఓ మహి ళ గొయ్యిలో పడ టంతో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అయినా ఆమెను వదలకుండా చేతికి అందిన బట్టలు పట్టుకుని లాగడంతో వివ స్త్రగా మారిందని వాపోయారు.

ఈ విషయ మై గుండాలపాడు వెస్ట్‌ బీట్‌ ఎఫ్‌బీఓ మహేశ్‌ను వివరణ కోరగా, గొడ్డళ్లతో ఉన్న మహిళలను అడవికి ఎందుకు వచ్చారని ప్రశ్నించగానే వారంతా పారిపోయారని, మహిళలపై తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని చెప్పారు. కాగా, గొత్తికోయ మహిళలపై దాడి చేసి వివస్త్రగా మార్చి అవమానించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర సహా య కార్యదర్శి పోటు రంగారావు, నాయకులు కుంజా కృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు