గవర్నర్‌ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

29 Aug, 2022 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేశభాషలందు తెలుగు లెస్స.. ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌ అని తెలుగు భాష గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు చెప్పారని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే ఐదు భాషల్లో తెలుగు ఒకటని తెలిపారు.

తమిళనాడులో పుట్టిన తాను తమిళ భాషకు సమానంగా తెలుగును గౌరవిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడుతు న్నానని వెల్లడించారు. మన తెలుగు భాషను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఆదివారం తెలుగులో మాట్లాడిన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.    

మరిన్ని వార్తలు