హైదరాబాద్‌: వరల్డ్‌ బుక్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన చిన్నారి  

27 May, 2022 17:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరల్డ్‌ బుక్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ఆ చిన్నారి అబ్బుర పరిచింది.. వచ్చీ రాని మాటలతో సరిగా పదాలే పలకలేని చిన్నారి ఏకంగా ప్రీహిస్టారికల్‌ అనిమల్స్‌ పేర్లను చకా చకా చెబుతూ  ఆశ్యర్య చకితులను చేస్తోంది.. నిజాంపేట్‌ సిరిబాలాజీ టవర్స్‌లో నివాసముండే మధు కుమార్తె నాలుగేళ్ల గొట్టుముక్కుల నితీషా కేవలం 30 సెండ్ల వ్యవధిలోనే అత్యధిక ప్రీహిస్టారిక్‌ యానిమల్స్‌ను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.  చిన్నారి జ్ఞాపక శక్తిని గమనించిన తల్లి  మధు ఆమెకు ప్రీహిస్టారిక్‌ యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలను చూపించారు.

వీడియో చూసే క్రమంలో ఠక్కున సదరు జంతువుల పేర్లను చెప్పడం ప్రారంభించింది. దీంతో చిన్నారి తల్లి మధు ప్రీహిస్టారికల్‌ యానిమల్స్‌ పేర్లు చెబుతున్న క్రమంలో వీడియోలు తీసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపించారు. చిన్నారి ఘనతను గుర్తిస్తూ ఈ నెల 23న వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుండి, 21న ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుండి కన్షర్మేషన్‌ లెటర్లు అందాయని చిన్నారి తల్లి మధు ‘సాక్షి’ కి తెలిపారు.  

మరిన్ని వార్తలు