హైదరాబాద్‌లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన

2 Aug, 2022 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత రెండు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థమవడం  లేదు. అప్పటి వరకు భగభగమంటున్న సూర్యుడు మాయమైపోయి.. ఒక్కసారిగా మేఘాలు కమ్మేస్తున్నాయి. వర్షం దంచికొడుతుంది అని అనుకునేలోపు అనూహ్యంగా  మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులతో నగర ప్రజలకు  తికమకపడుతున్నారు.

భారీ వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మూడు గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనరగ్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఉప్పల్‌ చిలుకానగర్‌, రామంతపూర్‌, మణికొండ, పుష్పాలగూడ, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, నార్సింగి, అత్తాపూర్‌, గండిపేటలో వాన పడుతోంది. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ట్ట్రాఫిక్‌ పోలీసులు సూచన
హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్‌ పోలీసులు వర్ష సూచన చేశారు. నగరంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు.  ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, వర్షం తగ్గిన తర్వాతనే బయటికి రావాలని తెలిపారు. 

  

వర్షం పడుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని పేర్కొన్నారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని, కావున ముందే  కొన్ని ముఖ్యమైన రోడ్లలో  ఇతర మార్గాలలో వెళ్లాలని చెప్పారు.

మరిన్ని వార్తలు