వరదలు: కేంద్ర మంత్రి 3 నెలల జీతం విరాళం

20 Oct, 2020 21:27 IST|Sakshi
మంత్రి కిషన్‌రెడ్డి(ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరబాద్‌ నగరం జలమయమైంది. పట్టణంలోని పలు కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో అడుగు భయట పెట్టలేని పరిస్థితులను నెలకొన్నాయి. హైదరాబాద్‌ వరదల వల్ల సామాన్య జనం నుంచి ధనిక ప్రజల వరకు నిత్యవసర సరుకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద తెలంగాణ ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతేగాక సినీ, రాజకీయ ప్రముఖలు సైతం వరద బాధితుల ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమ వంతు సాయం కింద టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ఆగ్ర హీరోలు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అంతేగాక పలు రాజకీయ నేతలు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన మూడు నెలల జీతాన్ని ప్రకటించి ఆయన ఉదారతను చాటుకున్నారు.

చదవండి: తెలంగాణకు సినీ ప్రముఖుల విరాళాలు

మరిన్ని వార్తలు