జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌  

23 Dec, 2022 02:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వచ్చే ఏడాది జూన్‌ 4న నిర్వహిస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.

ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్‌–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ర్యాంకుల ప్రకారం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు