20 ఏళ్ల సంబురాలు: కేటీఆర్‌ కీలక ప్రకటన 

26 Apr, 2021 18:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేపటితో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆవిర్భవించి 20 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుందామంటే రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటిస్తూ పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపద్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి, తెలంగాణను అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దాం.. మన ఆత్మగౌరవాన్ని మరో మారు చాటుదాం’ అని తెలిపారు.

చదవండి: మా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టబోం
చదవండి: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు