ఎమ్మెల్సీ ఎన్నికలు: చెల్లని పట్టభద్రులు..!

20 Mar, 2021 10:09 IST|Sakshi

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటు కాని ఓట్లు వేలల్లోనే..

పోలైన ఓట్లలో ఇవి సుమారు

6% చొప్పున ఉన్నట్లు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: వారంతా పట్టభద్ర ఓటర్లు... సాధారణ పౌరులతో పోలిస్తే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకూ అర్హత కలిగిన వారు.  కానీ రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో వేల మంది పట్ట భద్రుల అవగాహనారాహిత్యం బయటపడింది. బ్యాలెట్‌ పత్రంపై తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో అంకెలను సూచించాల్సి ఉండగా అందుకు భిన్నంగా కామెంట్లు, సంతకాలు చేశారు. ఫలితంగా భారీ స్థాయిలో ఇలాంటి ఓట్లు చెల్లకుండా పోయాయి.

హైదరాబాద్‌– మహబూబ్‌ నగర్‌–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో పోలైన ఓట్లలో సుమారు 6 శాతం పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా మురిగిపోయాయి. పట్టభద్రుల ఎన్నికలో ఈసారి 3,58,348 లక్షల ఓట్లు పోలవగా అందులో 21,309 ఓట్లు వివిధ కారణాలతో చెల్లలేదు. అదేవిధంగా నల్లగొండ– వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలవగా అందులో ఏకంగా 21,636 ఓట్లు చెల్లనివిగా తేలాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది సుమారు 6 శాతం కావడం గమనార్హం. 

చదవండి: రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు తగ్గిన మెజారిటీ‌‌ 
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం!

మరిన్ని వార్తలు